కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతుల కుమార్తె.. ఉక్కులు (5) మంగళవారం (అక్టోబర్ 15న) అస్వస్థతకు గురైంది. దీంతో.. తల్లిందండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పరీశిలించిన వైద్యులు.. అప్పటికే ఆ చిన్నారి గుండె ఆగిపోయిందని తెలిపారు. ఆ వార్త విని ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అప్పటివరకు ఎంతో చురుకుగా ఆడుకునే తమ కూతురు.. చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేక గుండెలు బాదుకున్నారు. వారి రోధనలు చూసి.. అక్కడున్నవాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. చిన్నారికి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. చిన్నారికి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఏమైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నరాు. ఆ సమస్యను తల్లిదండ్రులు గుర్తించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి.. ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారికి గుండెపోటు.. జమ్మికుంటలో తీవ్ర విషాదం
7