Thursday, February 26, 2026
Home » డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు - సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా సంచలనంగా మారింది. కేవలం పేద వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ బడాబాబుల ఇళ్లను కూల్చివేతలను వదిలేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ అడ్డంకులు తగులుతున్నాయి. మూసీ నది నిర్వాసితులు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ ప్రయోగానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా మూసీ నది సుందరీకరణ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం పట్టు బట్టుకుంది. అయితే.. తాజాగా మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,00 ఆర్థిక సాయం అందించబడింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు.

5 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు..

మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రకారం 15 వేల డబుల్ బెడ్‌ రూం ఇళ్లను మూసీ రివడ్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌లో కుటుంబాల పునరావాసానికి రాష్ట్ర సర్కార్ కేటాయించింది. రివర్‌ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. నిర్వాసితులకు డబులు బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch