20
ములకపాడు హాస్పిటల్ క్రీడా మైదానంలో దుమ్ముగూడెం టాలెంట్ క్రికెట్ లీగ్ ను దుమ్ముగూడెం సిఐ అశోక్ తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు. దుమ్ముగూడెం సిఐ అశోక్ మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి లక్ష్యాలను నెరవేర్చుకోవాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సీఐ అశోక్ బ్యాటు, బంతితో మైదానంలో కొద్దిసేపు క్రికెట్ ను ఆడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సీతమ్మ, ఎస్సై గణేష్, మండల అధ్యక్షుడు వినిల్, తదితరులు పాల్గొన్నారు.