Saturday, March 14, 2026
Home » మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మైసూరు శివారులోని ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ
  • 50 మందికిపైగా అరెస్ట్..శాంపిళ్లు సేకరణ
  • చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకా మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లోని రేవ్‌పార్టీలో జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులొచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ లియాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు చేశారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

రేవ్‌పార్టీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేసు విచారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి శాంపిళ్లు సేకరించామని, రిపోర్టుల కోసం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch