16
నిండు కుండల్లా చెరువులు..
వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారాయి. అనేక చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువుల్లో మత్తడి పోసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరో రెండ్రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.