Friday, March 27, 2026
Home » అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేత

హైదరాబాద్ :-రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించిన ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు.

ఈ నెల 31వ తేదీన తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనం ఖర్చవుతుంది. వేలమంది కడుపు నింపుతున్న ఈ కార్యక్రమంలో తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు గురుస్వామి నాయుడు అన్నారు. పేదలకు రూ.5లకే అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్నక్యాంటీన్ల నిర్వహణలో భాగస్వాములయ్యేందుకు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు ముందుకు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్నక్యాంటీన్లలో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన గురుస్వామి నాయుడుని సీఎం చంద్రబాబు అభినందించారు. పేదల కడుపు నింపే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరైనా తోచిన స్థాయిలో విరాళం అందించడానికి సీఎం అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch