2
సూర్యాపేట ముద్రణ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
రెండేళ్ల ఈ పదవి కాలానికి గాను నియమింపబడ్డ అమిత్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమిత్ రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి రావడం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవకులు చలసాని శ్రీనివాసరావు, చలసాని రాజన్న ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ ఎన్నారై చలసాని రాజీవ్, ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.