13
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోత పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.