Sunday, March 15, 2026
Home » ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ప్రకటనపై ‘స్టే’ విధించింది సుప్రీంకోర్టు… కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమన్న ధర్మాసనం… కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని.

ముందస్తు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అని సూచించిన ధర్మాసనం. వాస్తవానికి తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేశారు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది ధర్మాసనం. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది న్యాయమూర్తి విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఉందని స్పష్టం చేసింది ధర్మాసనం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch