ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. సీబీఐ సహా ఈడీ కేసులోనూ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం బెయిల్‌నిచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీడ్ ట్రయల్‌కి ఆయనకు హక్కు ఉందని తేల్చి చెప్పింది. “దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. స్పీడీ ట్రయల్‌కి వెళ్లే హక్కు ఆయనకు ఉంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఆయనకు ఈ హక్కు కల్పించాల్సింది” అని న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
#చూడండి | ఢిల్లీ | మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై, ఆప్ నేత తరపు న్యాయవాది రిషికేశ్ కుమార్ మాట్లాడుతూ, “సిబిఐ మరియు ఇడి కేసుల్లో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతను గత 17 నెలలుగా జైలులో ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా నుండి చెప్పారు… pic.twitter.com/0qg9IjcPKe
– ANI (@ANI) ఆగస్టు 9, 2024
బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండీషన్లు పెట్టింది. సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని తేల్చి చెప్పింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేసింది. అంతకు ముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన వాదనను పట్టించుకోవాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్‌కి ఇదే కేసులో బెయిల్ లభించింది. ఆ తరవాత సిసోడియాకు బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కీ బెయిల్ వచ్చినప్పటికీ అది కేవలం ఈడీ కేసులో పరిమితమైంది. సీబీఐ కేసులో మాత్రం ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు.