ఎటపాక లోతట్టు ప్రాంతాల మునక
వరద నీరు భారీగా రావడం వల్ల బ్యాక్ వాటర్ ను పంపుల ద్వారా గోదావరిలోకి పంపడం కష్టతరమవుతుంది. గోదావరి వరద తగ్గే అవకాశం ఉన్నందున, వరద నీటిమట్టం తగ్గాక పూర్తి స్థాయిలో నీరు ఎత్తి పోస్తారు. కొంతమంది వ్యక్తులు పంపులు నడపకపోవడం వల్ల ప్రజల నివాస స్థలాల్లోకి నీరు వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. సంఘటన స్థలంలో భద్రాచలం ఆర్డీవో, పోలీసు సిబ్బంది, పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. మరో వరద వైపు రెడ్డిపాలెం – సారపాక మధ్యలో ప్రధాన రహదారి పైకి గోదావరి నీరు చేరుతోంది. దీంతో ఈ దారిలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా గోదావరి వరద మరింత పెరుగుతోంది ప్రజల చుట్టుపక్కల మండలాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.