18
వర్షాల నేపథ్యంలో గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది, రామన్నగూడెం వద్ద కరకట్ట కోతకు వస్తోంది. దీంతో ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీర ప్రాంతంలో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏటూరు నాగారం ఉన్న బెస్త వాడ, ఎస్సీ కాలనీ, రామన్నగూడెం, కొత్తూరు, బుట్టాయిగూడెం; మంగపేట వారు పోడూరు, అక్కినపల్లి, కమలాపూర్, వాడగూడెం, రమణక్క, కత్తిగూడెం, గుడ్డెలుగుల పల్లి, మంగపేట, బోర్ నర్సాపూర్ గ్రామాలను తరచూ వరదలు వణికిస్తుండగా, కరకట్ట కోటకు పైగా ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.