Friday, November 22, 2024
Home » ‘కల్కి 2898 ఎడి’ రివ్యూ – Sravya News

‘కల్కి 2898 ఎడి’ రివ్యూ – Sravya News

by News Watch
0 comment
'కల్కి 2898 ఎడి' రివ్యూ


నటీనటులు: ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్‌, శోభన చేపట్టారు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోజికోవిచ్
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, నాగ్‌ అశ్విన్‌
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సి.అశ్వినీదత్
నిర్మాణం: వైజయంతి మూవీస్
రచన, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
విడుదల తేదీ: 27 జూన్, 2024
సినిమా నిడివి: 180.36 నిమిషాలు

ప్రభాస్‌ హీరోగా ‘కల్కి 2898ఎడి’ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతుంది అనే ఎనౌన్స్‌మెంట్‌ వచ్చిన రోజు నుంచి సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మహాభారత గాధ కొన్ని పాత్రలను తీసుకొని తయారు చేసిన ఈ కథను అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో మునుపెన్నడూ టాలీవుడ్‌లో రూపొందించారు. మరి ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయింది? నాగ్‌అశ్విన్‌ ఈ సినిమా ఏ రేంజ్‌లో తీశారు? ప్రభాస్ ఇమేజ్‌ని ఈ సినిమా ఎంతవరకు తీసుకెళ్ళింది? అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనే విషయాలను సమీక్షించి తెలుసుకుందాం.

కథ:

ఓపెన్ చేస్తే మహాభారత యుద్ధం.. అశ్వథ్థామ, శ్రీకృష్ణుడి మధ్య పోరాటం. తనను చంపేందుకు ప్రయత్నించిన అశ్వథ్థామను.. చిరంజీవిగా ఉంటూనే ఒళ్ళంతా గాయాలతో జీవిస్తావని శపిస్తాడు కృష్ణుడు.. కట్ చేస్తే కథ కాశీలో కొనసాగుతుంది. 2898 ఎడిలో ఎడారిగా మారిన కాశీ ఉనికిగా ఉన్న నగరంగా పరిచయం అవుతుంది. మరో పక్క కల్పిత నగరమైన శంబాలలో యాస్కిన్‌కి రెబల్స్‌గా పిలవబడే ఒక సైన్యం ఉంటుంది. కాశీ నగరం పైన కాంప్లెక్స్ పేరుతో మరో లోకం ఉంటుంది. అక్కడ ఉన్న సుప్రీమ్‌ యాస్కిన్‌ అనుచరులు కొందరు ఆరోగ్యవంతమైన అమ్మాయిలను కాంప్లెక్స్‌కి రప్పించుకొని వారి నుంచి సీరంను సేకరిస్తుంటారు. వారిలో సుమతి(దీపికా పదుకొనే) కూడా ఉంటుంది. ఒక సందర్భంలో అక్కడి నుంచి తప్పించుకుంటుంది సుమతి. ఆమె రాకకోసమే ఎదురుచూస్తుంటాడు అశ్వథ్థామ(అమితాబ్‌ బచ్చన్‌). మరో పక్క భైరవ(ప్రభాస్‌) సుమతిని యాస్కిన్‌ అనుచరులకు అప్పగించాలని ప్రయత్నిస్తాడు. సుమతి కోసం అశ్వథ్థామ ఎందుకు ఉన్నాడు? వారిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి? సుమతిని భైరవ ఎందుకు వెంబడిస్తున్నాడు? యాస్కిన్‌ అమ్మాయిల నుంచి సీరం ఎందుకు సేకరిస్తున్నాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

‘కల్కి’ అనే టైటిల్‌తో సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. విజువల్‌గా ఇప్పటివరకు ఎవరూ చేయని అద్భుతాలు ఈ సినిమాలో చేశాడు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా అనిపిస్తుంది. 2898 సంవత్సరం నాటికి మానవ సమాజం ఎలా మారిపోయింది. నీళ్ళు అనేవి లేక నగరాలు ఎడారులుగా ఎలా మారిపోయాయి అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా భైరవ, బుజ్జి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అలాగే ప్రభాస్‌, అమితాబ్‌ మధ్య జరిగే పోరాటాలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ఈ మ్యాడ్‌ మాక్స్‌, స్టార్‌ వార్స్‌ వంటి కొన్ని హాలీవుడ్‌ సినిమాల ధోరణి కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని ప్రశ్నలు మన మనసుల్లో మెదులుతుంటాయి. వాటికి సమాధానం సీక్వెల్‌లో దొరుకుతుందని సినిమా ఎండిరగ్‌లో అర్థమవుతుంది.

నటీనటులు :

ఈ సినిమాలో నటినటుల పెర్ఫార్మెన్స్‌ గురించి చెప్పాలంటే.. ముందుగా అమితాబ్‌ బచ్చన్‌ గురించి చెప్పాలి. అశ్వథ్థామగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే హీరోని డామినేట్ చేసే రేంజ్‌లో ఆయన నటన ఉంది. యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ ప్రజెన్స్‌ నిజంగా సూపర్బ్. తక్కువ సన్నివేశాల్లో కనిపించినా ఆకట్టుకున్నాడు. ఇక భైరవగా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను అద్భుతంగా చేశాడు. గ్లామర్‌ పాత్ర కాకపోయినా ఈ తరహా క్యారెక్టర్‌ కోసం దీపికా పదుకొనే ఒప్పుకోవడం గ్రేట్‌ అనే చెప్పాలి. మిగిలిన క్యారెక్టర్లలో దిశాపటని, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌, పశుపతి వంటి వారు ఓకే అనిపించారు. ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక పాత్రల్లో విజయ్‌ దేవరకొండ, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి, దుల్కర్‌ సల్మాన్‌ కాసేపు మెరిసారు.

నిపుణులు సాంకేతిక:

ఈ సినిమాకి టెక్నికల్ టీం చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ నుంచి విజువల్‌ ఎఫెక్ట్స్‌ వరకు సినిమాకి ప్రాణం అని చెప్పాలి. ఇక ఆర్ట్‌ డైరెక్షన్‌ ఈ సినిమాకి వెన్నెముకలాంటిదని సినిమా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రతి షాట్‌లో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కష్టం ఏమిటో అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలో మనం చూడని ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక సంతోష్‌ నారాయణన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంది. అతని మ్యూజిక్‌ వల్ల ఎన్నో సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే…

కథ, కథనాలు ఎలా ఉన్నా ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తీసి తన సత్తా ఏమిటో ప్రూవ్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ ఒక విజువల్‌ వండర్‌లా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మరోసారి ప్రభాస్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసి రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.

రేటింగ్ : 3.25/5

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch