
ఇటీవల కాలంలో సినీ రంగానికి సంబంధించి పెళ్లిళ్ల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలానే మరికొందరి సెలబ్రిటీల వివాహాలకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నిజం అవుతుండగా, అలా కొనసాగుతూనే ఉన్నాను. ఇప్పటికే కొన్ని జంటల విషయంలో విడాకుల వార్తలు రాగా.. తాజాగా బిగ్ బాస్ విన్నర్ తన ప్రియుడితో బ్రేకప్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఆ బ్యూటీ, ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూడండి…
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం లేదు. గతంలో పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. అయితే బిగ్ బాస్ ద్వారా ఈ బ్యూటీ మంచి ఫేమ్ ను సంపాదించింది. ఆమె కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక హిందీ సీరియల్స్ లో నటించి..బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తేజస్వీ ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అలానే తేజస్వి ప్రకాష్ బిగ్‌బాస్-15 సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆ షోలో ఉన్నంత సేపు తనదైన ఆటతో, మాటలతో అందరిని ఆకట్టుకుంది. అందరినీ దాటుకుంటూ చివరకు బిగ్ బాస్ సీజన్ 15 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను లవ్ చేసింది.
అలా ఇద్దరు చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. గత మూడేళ్లుగా తేజస్వీ, కరణ్ డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు చూపిస్తున్నారు. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పినట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు తలెత్తాయని టాక్. ఈ కావనే నెల రోజుల క్రితం బ్రేకప్ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. వీరిద్దరు విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్ కానీ, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు. అదనంగా ఈ వార్తలను ఖండించడం లేదా, సమర్థించడం చేయలేదు.
ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి జంట ముంబయిలో కనిపించింది. ప్రముఖ రెస్టారెంట్ జరిగిన ఓ వేడుకలో ఉంది. అనంతరం రెస్టారెంట్ బయట ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో వారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది మరో వేడుకలో అలా కలిసారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా జంట బ్రేకప్ కి సంబంధించి వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా ప్రచారం జరుగుతోంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి