Monday, December 8, 2025
Home » ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • దేశ వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి అమలు కానున్న నూతన చట్టాలు*
  • నూతన చట్టాలపై జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి దశల వారీగా ముగిసిన శిక్షణ తరగతులు
  • వనపర్తి పోలీసులకు జిల్లా నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి

ముద్ర.వనపర్తి:-ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి అన్నారు. జిల్లా ప్రధాన కాన్ఫరెన్స్ హాల్ నందు నూతన చట్టాల గురించి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాల కార్యక్రమం జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న ప్రతి ఒక్క జిల్లా నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి మరియు సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బందికి ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం తెలియజేశారు.జులై 1వ తేదీ భారతీయ కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.కొత్త చట్టాలైన న్యాయ సంహిత(BNS),భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS),భారతీయ సాక్ష్య అధినియం-2023 పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమని,కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాద్యం అవుతోంది.

కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరం.అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు.అరెస్ట్,వాంగ్మూలం నమోదు నందు పాటించాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు చేపట్టాల్సిన తీరు,తదితర కొత్త చట్టాల మార్పుల గురించి వివరించారు.భారతన్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ,అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది.నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణలో మార్పు వస్తుందని,ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు అందజేయడానికి వీలుగా ఉంటుంది.అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నూతన చట్టాలపై అధికారులు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయకర్తగా వ్యవహరించిన డీసీఆర్బీ డీఎస్పీ కృష్ణ కిషోర్, భాష, మూర్తితోపాటు పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch