ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది యాక్షన్, డ్రామా, ఎమోషన్, థ్రిల్లర్, హారర్ అంటూ చాలా సినిమా చూస్తున్నారు. కానీ, ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసి చాలా రోజులు అవుతోంది. ఒక మంచి పాటలాంటి సినిమాలు చూడటమే మానేశారు. అలాంటి వారికోసం ఒకమంచి ఫీల్ గుడ్ మూవీ తీసుకొచ్చాం. ఇంకా ఈ మూవీని కచ్చితంగా ప్రతి అమ్మాయి చూడాలి. ఎందుకంటే పెళ్లి, పిల్లలు, వంటిల్లు అని ఎవరి జీవితాలను ఎవరూ నిర్ధారించకూడదు. ఎవరి జీవితం వారి నిర్ణయాల మీదే నడవాలి. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిందే ఈ మూవీ. అయితే ఈ మూవీలో ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి.
ఈ సినిమా మొత్తం సారా లైఫ్ గురించే నడుస్తూ ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. జీవితంలో ఏదో సాధించాలి అంటే కలలు కంటుంది. ఒక పెద్ద డైరెక్టర్ కావాలి అనేది ఆ అమ్మాయి కల. కానీ, వాళ్ల కుటుంబం మాత్రం మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో.. పిల్లల్ని కను అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అయితే సారా తన కెరీర్.. గోల్స్ లాంటిదే తన లైఫ్ లో చిన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తాను జన్మలో పిల్లలను కనను అని. అదే పరిశీలన తన కుటుంబానికి కూడా చెప్పేస్తుంది. కానీ, ఆ విషయంలోనే వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయి అలాంటి నిర్ణయం అసలు ఎలా తీసుకుంటుంది అని అందరూ గొడవ చేస్తారు.
సారా మాత్రం తన గోల్స్, డైరెక్టర్ అవ్వాలి అంటే కల చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. తాను ఒక మంచి కథ రాసుకుంటుంది. ఆ కథను చాలా ప్రొడ్యూసర్ల దగ్గరకు తీసుకెళ్తుంది. ఎవరిని కలిసినా ఆమె అమ్మాయి అని చిన్నచూపు చూస్తారు. అమ్మాయి అసలు డైరెక్టర్ కాగలదా అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అసలు సారా ఎందుకు పిల్లలని కనకూడదు? ఎందుకు సారా డైరెక్టర్ కావాలి అనుకుంది? అసలు సారా లైఫ్ తాను అనుకున్నట్లు జరుగుతుందా? అనే బిగ్ క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. వాటికి అదనంగా ఈ సినిమాలో ఫెమినిజం కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దాదాపుగా ఈ ఫెమినిజం కాన్సెప్ట్ పై చాలానే అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది. ఈ సినిమా పేరు సారా. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఈ సారా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.