16
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.11,444 కోట్లను కూడా ఎలా ఖర్చు చేస్తారో నేదానిపై ఉద్యోగుల్లో, కార్మికుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్‌ఎండీసీకి 1,500 ఎకరాలను కుదవపెట్టడంతో దాదాపు రూ.2,250 కోట్లు, స్టీల్‌ప్లాంట్ భూమి అమ్మగా వచ్చిన రూ.260 కోట్లను యాజమాన్యం ఏం చేసిందో, ఎలా ఖర్చు చేసిందో అర్థం కావాల్సిన అవసరం లేదని కార్మిక సంఘం నేతలు భావిస్తున్నారు. ఈ రూ.11,444 కోట్లు కూడా దేనికిపడితే దానికి ఖర్చు చేస్తే, దానివల్ల స్టీల్‌ప్లాంట్‌కు ఉపయోగమేమీ ఉండదని అభిప్రాయ పడుతున్నారు.