Sunday, January 19, 2025
Home » అవినీతి ప్రభుత్వం అంతమైంది అభివృద్ధి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది – Newswatch

అవినీతి ప్రభుత్వం అంతమైంది అభివృద్ధి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది – Newswatch

by News Watch
0 comment
అవినీతి ప్రభుత్వం అంతమైంది అభివృద్ధి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది


  • కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి ముద్ర :- రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం అంతమై ప్రజలకు అభివృద్ధి చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు శుక్రవారం తుంగతుర్తి మండల సిరి ఫంక్షన్ హాల్లో జరిగిన గీత కార్మిక సంఘం రక్షణ కిట్ల పంపిణీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాటమయ్య రక్షణ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 275 మంది కల్లు గీత కార్మికులకు మంజూరైన కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డ అని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన. గీత కార్మికులకు రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులను గుర్తించి వారికి ప్రభుత్వం కిట్లు జరుగుతుందని అన్నారు.

గీత కార్మికులకు ప్రమాద బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పారు. నాటి ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు నాలుగు సార్లు మాఫీ చేస్తే, నేడు ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.2 రెండు రుణమాఫీ ఏకధాటిగా చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని అన్నారు. ప్రతి ఒక్కరు సర్వాయి పాపన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలని. ఎస్సారెస్పీ కాల్వ ద్వార నీళ్లను తుంగతుర్తికి తీసుకొచ్చిన ఘనత బి.యన్.రెడ్డి అన్నారు. నాడు బియన్ రెడ్డి పోరాట ఫలితమే ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు వస్తున్నాయని ఇది పోరాటాల గడ్డ అని ఎమ్మెల్యే అన్నారు. తనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకోలేనిది అన్నారు. ఈ ప్రభుత్వం నిజాయితీగల ప్రజాప్రభుత్వం అని అన్నారు,. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని. సమావేశం అనంతరం శాలిగౌరారం మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేయాలని కోరుతూ తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌తో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

ఈకార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, నూతనకల్ సింగిల్ విండో చైర్మన్ జయసుధ,తహసిల్దార్ పి. దయానంద్,జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జి.అనసూర్య, ఎంపీడీవో శేషు కుమార్, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ గామయ్య, ఎక్సైజ్ సీఐ రజిత, మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్,నల్లు రాంచంద్రారెడ్డి,రే శ్రీను రవి,దాసరి , రేగటి వెంకటేష్, గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపూరి శ్రీకాంత్ గౌడ్,తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు,ఎక్సైజ్ సిబ్బంది,వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గీత కార్మికులు నిర్వహించారు.

The post అవినీతి ప్రభుత్వం అంత అభివృద్ధి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch