1
నకిలీ స్టాంపులతో ఫేక్ సర్టిఫికెట్లు
రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి అసిస్టెంట్ సివిల్ సర్జన్ పేరుతో నకిలీ స్టాంపులు తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్లు రూపొందించి అక్రమంగా విక్రయించారు. కోర్టులో బెయిల్ కోసం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం, స్కూల్లో ఇచ్చే డే టాప్ బర్త్ సర్టిఫికెట్లను వినియోగించిన ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేశారు. వాటిని ఉపయోగించి బెయిల్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు వినియోగించారని ఎస్పీ తెలిపారు. ఇటీవల నకిలీ సూరిటీ సర్టిఫికెట్ పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా చేయగా విచారణ చేయగా ఫేక్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టయింది. పట్టుబడ్డ వారి నుంచి రకాల నకిలీ డాక్యుమెంట్లు, ఆరు స్టాంప్ లు, సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు తయారు చేసి సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.