సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు.. ఎంతో కొంత సపోర్ట్ కూడా ఉండాలంటారు. ఎంత టాలెంట్ ఉన్నా సరే.. అదృష్టం, మద్దతు కూడా కావాలి. ఇక బాలీవుడ్‌లో ఇలాంటి బంధుప్రీతి గురించి ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కొత్త వారిని రానివ్వకుండా.. వారికి అవకాశాలు ఇవ్వకుండా.. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే ఇండస్ట్రీలో పాతుకుపోయారని.. బయటి వారికి ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి కూడా ఇలానే విమర్శలు ఎదుర్కొంది. నీ చర్మం సరిగా లేదని మీదే విమర్శలు చేశారు. ఎక్కడికెళ్లినా ఇదే మాట.. ఇవే కామెంట్స్. ప్రారంభంలో ఆమె సుమారు 1000కి పైగా ఆడిషన్స్ ఇచ్చింది. కానీ ఎక్కడికెళ్లినా రిజెక్షన్నే ఎదుర్కొంది. కానీ చివరకు ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంది. ఇప్పుడు ఇండియాలోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇంతకు ఆ నటి ఎవరో గుర్తు పట్టారా..
మన దేశంలో అందానికి కొలమానం అంటే.. మిస్ ఇండియా పోటీలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. అయినా సరే విమర్శలు ఎదుర్కొంది. కానీ ధైర్యం కొల్పోలేదు. తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు సౌత్, బాలీవుడ్‌తో పాటు.. హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. తనే 2013లో మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచిన తెలుగందం శోభితా ధూళిపాళ్ల. ఈ పోటీల తర్వాత సినిమాల్లో రాణించాలనుకున్న ఆమెకు ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదురైనట్లు నటించింది. జీవితంలో ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా ఆడిషన్స్ ఇచ్చినట్లు. సినిమా అవకాశాల కోసం మూడేళ్ల పాటు ఎదురు చూశానని చెప్పుకొచ్చింది.
అవకాశాల కోసం తిరుగుతున్న వేళ.. చాలా మంది తన చర్మం గురించి అవహేళన చేసింది. నటిగా తాను సరిపోనని.. అందంగా లేనని ముఖం మీదే నేరుగా చెప్పారని.. అందంగా కనిపించని అమ్మాయిని తీసుకుంటే యాడ్స్ ఎలా చూస్తారంటూ అవమానించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శోభితా ధూళిపాళ్ల. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే.. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి చెప్పుకొచ్చింది.
ఈ అవకాశం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాళ్ల. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. అలాగే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. మేజర్, గాడ్సే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవన్ సిరీస్ ద్వారా ఓటీలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న శోభితా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్‌గా ప్రశంసలు అందుకుంది.