సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంటిపై దాడి చేసినందుకు అల్లు అర్జున్ కు క్షమాపణలు చెప్పాలని అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో నిత్యం వందల కాల్స్ వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు వాపోయారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. తమ ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవుతున్నాయి. మాకు ఫోన్ కాల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దేనని, ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. అలాగే ఫోన్ చేసి బెదిరింపులకు చూస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.