Monday, November 25, 2024
Home » కల్కి టికెట్స్ రేట్లు వరం కాబోతున్నాయా? శాపం కాబోతున్నాయా? – Sravya News

కల్కి టికెట్స్ రేట్లు వరం కాబోతున్నాయా? శాపం కాబోతున్నాయా? – Sravya News

by News Watch
0 comment
 కల్కి టికెట్స్ రేట్లు వరం కాబోతున్నాయా?  శాపం కాబోతున్నాయా?










పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898ఏడీ. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతోంది ఈ కల్కి 2898 ఏడీ సినిమా. మామూలుగా రాజమౌళి సినిమాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా బాగా రాబట్టుకోగలిగింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఉన్నారు. ఇదే సమయంలో కల్కి సంబంధిత టికెట్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి.. ఇలా పెరిగిన టికెట్స్ రేట్లు కల్కికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ మూవీ తెరకెక్కింది. డార్లింగ్‌ అభిమానులు అయితే జూన్ 27 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కల్కి నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లు, టీజర్‌లు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ హైప్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కల్కి టీమ్‌ని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ధరల పెంపుపై రెండు తెలుగు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కార్ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో కల్కి మూవీ టికెట్ల ధరలు పెరిగాయి.

కల్కి టిక్కెట్ల ధర

రాష్ట్రంలో జూన్ 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు.. కల్కి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. అదే విధంగా జూన్ 27 ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి కూడా అంగీకారం ఉంది. అలానే ఒక్కో టికెట్‌పైన రూ.200 పెంచుకోవచ్చని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా టికెట్ రేటు విషయానికి వస్తే.. సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే పెరిగిన ధరలను బట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్క టికెట్ కోసం రూ.377 కాగా మల్టీఫ్లెక్స్‌ల్లో దాదాపు రూ.500 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

మిగిలిన రోజుల్లో మూములు థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలుగా కల్కి టికెట్‌ ధర ఉండనుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుకూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకలకు క్యూ కడితే.. పెరిగిన ధరల ప్రకారం.. కల్కి సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇంకా తక్కువ సమయంలోనే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టవచ్చు. పెరిగిన ధర విషయంలో మరో కోణాన్ని చూసినట్లు అయితే ఇద్దరు జంట సినిమాకు మల్టీప్లెక్స్ లో వెళ్లాలంటే..దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది.

దీని బట్టి ప్రేక్షకులు పెరిగిన ధరలను చూసి..కాస్తా వెనుకడుగు వేస్తే.. అది సినిమాపై మైనస్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. మరో కుటుంబ సమేతంగా వెళ్లే చూసేందుకు కూడా కాస్త వెనుకడుగు వేస్తే.. అది కలెక్షన్ పై ప్రభావం చూపుతుందని టాక్. కానీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి.. భారీగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తే మాత్రం పెరిగిన టికెట్ల ధరలు కల్కీ మూవీకి వరంగా మారుతాయి. అయితే పెరిగిన టిక్కెట్ల ధరలు, కల్కీకి వరమా?శాపమా? అనేది తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch