16
రష్యా సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం, లెనిన్ శత వర్ధంతి సందర్భంగా న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ఇవాళ సదస్సు నిర్వహించారు. వంద మందికి పైగా ఈ సదస్సు విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. కామ్రేడ్ ఆర్. రఘు (న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్) సభకు అధ్యక్షత వహించగా, వక్తలు బిపిన్ బలరామ్ (మార్క్స్ సర్కిల్, కేరళ), జయప్రకాష్ (న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్), డా. ఎస్. సురేష్ (న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్) మార్క్సిస్టు సిద్ధాంతానికి, ఆచరణకి లెనిన్ చేసిన కృషిని గురించి చర్చించారు.