2
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందకు దింపేసి తనిఖీలు చేపట్టారు.