18
పక్కా ప్లాన్ ప్రకారమే
నిందితుడు విఘ్నేష్ కడపలోని ఓ హోటల్ వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి వివాహం అయ్యింది. అతడి భార్య గర్భిణి. విఘ్నేష్, బాధిత బాలిక(16)కు ఐదేళ్ల పరిచయం ఉంది. బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. శుక్రవారం విఘ్నేష్, విద్యార్థికి ఫోన్ చేసి కలవాలని కోరాడు. లేదంటే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దీంతో విద్యార్థిని శనివారం కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరగా…మార్గమధ్యలో విఘ్నేష్ ఆ ఆటో ఎక్కాడు. వీరిద్దరూ బద్వేలకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలో ఆటో దిగిపోయారు. అనంతరం వారిద్దరూ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి కాసేపు శారీరకంగా కలిశారు.