21
కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. పలు కారణాలతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను రానున్న ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హాయంలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సివిల్ కానిస్టేబుల్ 3580 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2520 పోస్టుల భర్తీ చేయాలన్నారు. 2022లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 4,59,182 మంది బాండ్లు. అందులో 95,209 మంది తదుపరి దశకు సెలెక్ట్ అయ్యారు.