Friday, November 22, 2024
Home » తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం – News Watch

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం – News Watch

by News Watch
0 comment
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం


తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గడచిన మూడు రోజులుగా వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావడంతో కొండపై ప్రదర్శన. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరులో 34,625 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. స్వామివారికి కానుకుల రూపంలో హుండీలో రూ.3.63 కోట్ల రూపాయలను సమర్పించారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం అవుతుండగా టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. గంటలు తరబడి వేచి ఉండాల్సి రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లోకి వెళ్లాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు అంతకన్నా ముందే వెళ్తే లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారం కూడా భక్తులు రద్దీ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో వివాహాలు చేసుకున్న, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తుండడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భక్తులకు అవసరమైన నీటిని అందించారు. చిన్నారులకు పాలు కూడా ఇస్తున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు.

బంగారు డ్రెస్సులో బుళ్లమ్మో.. మాల్దీవుల్లో శ్రియ హొయలు
పెళ్లికి రెడీ అయ్యే జంటలు ఈ మెడికల్స్ చేయించుకోవడం ఉత్తమం

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch