Wednesday, December 4, 2024
Home » బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోవడంతో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనలో విమానంలో వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విమాన ప్రమాదంపై దేశాధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు. విమానంలోని వారందరూ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch