- ఈనెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా
- రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ జెండా ఎగరాలి
- కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు
- రుణమాఫీ కాల్ సెంటర్ కు వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి
- బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది. భాగంగా మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారులు, అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు హర్ఘర్ తిరంగా , క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, రుణమాఫీ కాకుండా బాధపడుతున్న రైతుల సమస్యలు, యువత, మహిళా సమస్యలు, తాజా రాజకీయ సమస్యలపై చర్చించారు. బీజేపీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే విధంగా కార్యచరణ రూపొందించాలని ఆయన సూచించారు.
బీజేపీ ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ జెండాను ఎగురవేయాలని ఆయన ఉన్నారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11వసారి త్రివర్ణ జెండాను ఎగురవేయబోతున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర రుణమాఫీకి సంబంధించిన కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రతి వేల సంఖ్యలో రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఎవరు సాయం చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.
ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తున్నారో అర్ధం కావడం లేదనే ఆందోళనలో రైతులు ఉన్నారని చెప్పారు. కాల్ సెంటర్ కు రైతుల ఫోన్ల తాకిడి పెరగడంతో ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. వచ్చే నాలుగున్నారేళ్ళపాటు కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి 36 శాతం ఓటింగ్ ఉందని, ఈ నేతలంతా అంకితభావంతో పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. రేపు చేయాల్సిన పని ఈరోజే చేసేలా, ఈరోజు చేయవలసింది ఇప్పుడే సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులను ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.