11
సైబర్ క్రైమ్ : సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో పద్ధతిలో జనాల ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఓరుగల్లు ఆఫీసర్లను టార్గెట్ చేశారు. సంస్థ ఆఫీసర్ల ఫేస్ బుక్ ఐడీలను హ్యాక్ చేయడం, ఆ తరువాత ఫేక్ ఐడీలు సృష్టించి, వాటి ద్వారా ఇతరులకు మెసేజ్ లు పంపించి డబ్బులు అడగడం మొదలుపెడుతున్నారు. గతంలో కూడా జరగలేదు, మూడు రోజుల వ్యవధిలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ కలెక్టర్ సత్య దేవి పేరున ఫేస్ బుక్ నుంచి డబ్బులు కావాల మెసేజ్ పంపించడం ఇలా కలవరానికి గురి చేస్తోంది. రోజు రోజుకు ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోతుండగా, ఏకంగా జిల్లా అధికారుల పేరుతోనే దుండగులు డబ్బులకు ఎర వేస్తుండటం కలకలం రేపుతోంది.