సదాశివపేట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తంగడపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అసంపూర్తిగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సింలు మాట్లాడుతూ.. తంగడపల్లి లో సుమారు రెండు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం ఆరకొరగా జరుగుతుందన్నారు. 2, 75 కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్నటువంటి బ్రిడ్జ్ ఎందుకు అసంపూర్తిగా ఉందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు జేబులు నింపుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చొరవ చూపి.. బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డుని నిర్మించాలని.. బ్రిడ్జిలు కూడా అతి త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని.. లేని యెడల కార్యాలయం ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని.. లైసెన్సును రద్దు చేయండి.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్
32
previous post