11
సీతమ్మ సబర్వాల్ మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయనీ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీర్ దేవేందర్ మండిపడ్డారు. దివ్యాంగులే ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్ లకు ఆదర్శంగా నిలిచారనీ గుర్తు చేశారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారనీ.. ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వాక్యాలు చేయడం సబబు కాదనీ హితవు పలికారు. అందచందాలను చూసి పదవులు ఇవ్వరు వారి వారి తెలివితేటలను వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇవ్వడం జరుగుతుందనీ స్పష్టం చేశారు. సీతమ్మ సబర్వాల్ వెంటనే యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు.