3
ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే సేచ్ఛా- హక్కుల కోసం గొంతుక లేస్తుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో అక్కడే నిజమైన నాయకత్వం పురుడుపోసుకుంటుంది. ‘జల్-జంగల్- జమీన్’ అనే నినాదంతో దండుకట్టి పోరుబాట సాగించిన ఆదివాసీ విప్లవ వీరుడు కుమ్రం భీం. నేడు ఆయన 84వ వర్ధంతి.