ఖమ్మం: దేశంలో సనాతన సాంప్రదాయాలను , హిందూ పర్వదినాలు , సంప్రదాయాలు మరియు హిందూ ధర్మ రక్షణకు పాటుపడుతున్న విశ్వహిందూ పరిషత్ యువతి విభాగం అయిన దుర్గా వాహిని ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ జల ఆంజనేయస్వామి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలోని దుర్గావాహిని కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ నివేదన చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శ్రీ బోనాల రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనది కావున మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు పర్వదినాలను కాపాడుకుంటూ మన జీవన విధానాన్ని హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాలని అలాగే హిందూ ధర్మానికి ఏవైనా ఆటంకాలు కలవకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు కృష్ణ , జిల్లా కోశాధికారి రవికుమార్, జిల్లా సహకార్యదర్శి రామకృష్ణ, దుర్గా వాహిని జిల్లా అధ్యక్షులు కనగంటి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభావతి రెడ్డి, కార్యకర్తలు భూక్యాసోని, పద్మ, అనూష, ధనలక్ష్మి, చంద్రావతి, నాగమణి , మాతృ శక్తి ప్రముఖులు కూచిపూడి భానుమతి, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సామినేని శ్రీనివాస్ , దేవేందర్ , రుద్ర బిక్షం , తదితరులు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ మహోత్సవం
6